Site icon HashtagU Telugu

Nayanthara – Trisha : నయనతార పాత్రని కొట్టేసిన త్రిష.. ఆ ఫాంటసీ మూవీలో..

Trisha Handovers Nayanthara Role In Mookuthi Amman 2

Trisha Handovers Nayanthara Role In Mookuthi Amman 2

Nayanthara – Trisha : పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోయిన్ త్రిష.. వరుస ఆఫర్స్ అందుకుంటూ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చేసారు. ప్రస్తుతం ఈ హీరోయిన్.. చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ లాల్, అజిత్ సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే నయనతార నటించిన సినిమా సీక్వెల్ ని కొట్టేసారు.

తమిళ్ కమెడియన్ ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో నయనతార నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘అమ్మోరు తల్లి’. 2020లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా అలరించింది మంచి సక్సెస్ ని అందుకుంది. దీంతో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సీక్వెల్ పనులు కూడా మొదలు పెట్టారు. ఇక ఈ సీక్వెల్ లో త్రిషని లీడ్ రోల్ గా తీసుకుంటున్నారట.

ప్రస్తుతం ఈ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులను పూర్తి చేసి, మూవీని సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారట. కాగా త్రిష కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, నయనతార చేయాల్సిన చాలా ప్రాజెక్ట్స్ ని కొట్టేస్తుందని చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్, లియో హిట్స్ పడకుంటే.. చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ లాల్, అజిత్ సినిమా అవకాశాలు కచ్చితంగా నయనతార చెంతకే చేరుండేవి.

కానీ త్రిష ఫార్మ్ లోకి రావడంతో.. నయనతారకి మైనస్ అయ్యిపోయింది. ప్రస్తుతం త్రిష చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, అజిత్ ‘విడా ముయార్చి’ సినిమాల్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు.