Trisha రెండు దశాబ్ధాలుగా సౌత్ లో తిరుగులేని విధంగా తన క్రేజ్ కొనసాగిస్తున్న బ్యూటీ చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ ఇప్పటికీ తన మార్క్ చూపిస్తుంది. కోలీవుడ్ లో ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తున్న త్రిష అక్కడ వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది. ఇక మరోపక్క తెలుగులో కూడా త్రిష వరుస ఆఫర్లు కొట్టేస్తుంది. త్రిష ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర సినిమా చేస్తుంది. ఆ సినిమాతో త్రిష గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఇక మరోపక్క అమ్మడు మరో రెండు క్రేజీ సినిమాల్లో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయట. అయితే ఆ సినిమాల్లో నటించేందుకు త్రిష దాదాపు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరోయిన్స్ కు కూడా 3 కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. దేవర సినిమాకు జాన్వి కపూర్ 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.
త్రిష కూడా 5 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని అంటుందట. త్రిష డిమాండ్ నిర్మాతలకు షాక్ ఇచ్చినా ఆమె మాత్రం అంత ఇస్తేనే కానీ సినిమాల్లో నటించడం కుదరదని చెబుతుందట. తెలుగులో త్రిష డిమాండ్ చూసి మిగతా హీరోయిన్స్ అంతా షాక్ అవుతున్నారు. విశ్వంభర హిట్ పడితే త్రిష రేంజ్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
Also Read : Nani : నాని కాదంటే ఆ హీరో ఓకే చేశాడా..?