Site icon HashtagU Telugu

Trisha : టాలీవుడ్ అంటే త్రిష గట్టిగా డిమాండ్ చేస్తుందా..?

చెన్నై చిన్నది త్రిష (Trisha) కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్ధాలు అవుతున్నా కూడా అమ్మడు ఇంకా తన ఫాం కొనసాగిస్తుంది. కోలీవుడ్ లో వరుసగా పి.ఎస్ 1, 2 సినిమాలతో పాటుగా దళపతి విజయ్ లియో సినిమాలో నటించింది అమ్మడు. ఆ సినిమాలో త్రిష నటన కన్నా ఆమె అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. వయసు పెరుగుతున్నా కొద్దీ త్రిష అందం పెరుగుతుందని అంటున్నారు. తమిళ్ లో సూపర్ జోరు కొనసాగిస్తున్న త్రిష ఈమధ్యనే టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

టాలీవుడ్ అంటే చాలు త్రిష ఓ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది. కోలీవుడ్ లో కూడా అమ్మడికి బాగానే డిమాండ్ ఉన్నా అక్కడ కన్నా తెలుగు సినిమాలకు త్రిష డబుల్ చార్జ్ చేస్తుందని తెలుస్తుంది. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు లైన్ లో ఉన్నాయట.

అయితే త్రిష ఎక్కువ రెమ్యునరేషన్ అడగడం వల్ల దర్శక నిర్మాతలు ఆమెను కాదంటున్నారట. తెలుగులో చేయాలనే ఆసక్తి లేక త్రిష ఎక్కువ డిమాండ్ చేస్తుందా లేక నిజంగానే ఆమె అడిగినంత ఇవ్వాలని అనుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా త్రిష తిరిగి మళ్లీ ఇక్కడ వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

దాదాపు టాలీవుద్ స్టార్స్ అందరితో కలిసి నటించిన త్రిష మళ్లీ తెలుగు రీ ఎంట్రీ ఇస్తే ఆమెని తీసుకునేందుకు స్టార్స్ రెడీగా ఉన్నారు. అయితే త్రిష మాత్రం అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే గానీ తెలుగులో నటించడం కుదరదని చెబుతుందట.

Also Read : Yatra 2 Trailer: ‘నేను విన్నాను, నేనున్నాను’.. ఆకట్టుకుంటోన్న ‘యాత్ర 2’ ట్రైలర్