Trisha : 13 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న త్రిష..!

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) రెండు దశాబ్ధాలుగా కెరీర్ కొనసాగిస్తున్నా ఇప్పటికీ సూపర్ ఫాం లో ఉంది. మధ్యలో కెరీర్ కొంత నత్త నడక నడిచినా తిరిగి మళ్లీ ఫాం

Published By: HashtagU Telugu Desk
Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) రెండు దశాబ్ధాలుగా కెరీర్ కొనసాగిస్తున్నా ఇప్పటికీ సూపర్ ఫాం లో ఉంది. మధ్యలో కెరీర్ కొంత నత్త నడక నడిచినా తిరిగి మళ్లీ ఫాం లోకి వచ్చింది త్రిష. కోలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న త్రిష లేటెస్ట్ గా తెలుగులో కూడా రెండు లక్కీ ఛాన్స్ లను అందుకుందని తెలుస్తుంది. చిరంజీవితో ఒక సినిమా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుండగా బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ సినిమాలో కూడా త్రిష నటిస్తుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

తెలుగులోనే కాదు లేటెస్ట్ గా అమ్మడికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. 13 ఏళ్ల క్రితం అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన త్రిష ఆ తర్వాత హిందీ నుంచి ఛాన్స్ వచ్చినా చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అమ్మడు బాలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ఈసారి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది త్రిష. ఏజ్ మీద పడుతున్నా కూడా త్రిష గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. తన లుక్స్ తోనే ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది అమ్మడు. రీసెంట్ గా వచ్చిన విజయ్ లియో సినిమాలో తన లుక్స్ తో వావ్ అనిపించిన త్రిష ఇదే ఫాం కొనసాగిస్తే మరో ఐదేళ్లు అమ్మడికి తిరుగు లేదని చెప్పొచ్చు.

Also Read : Anupama : టిల్లు కోసం అనుపమ గ్లామర్ షో..!

  Last Updated: 02 Jan 2024, 12:09 PM IST