Site icon HashtagU Telugu

Trisha : వెంకటేష్ మాత్రమేనా బాలకృష్ణ కూడానా..?

Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

Trisha చెన్నై చిన్నది త్రిష మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుంది. పి.ఎస్ 1, 2 సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకోగా దళపతి విజయ్ లియో సినిమాలో కూడా ఆమె అందంతో అలరించింది. ఇక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రిష టాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లు ఓకే చేస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చిరు పక్కన జత కడుతున్న త్రిష రెమ్యునరేషన్ పరంగా కూడా భారీ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

ఇక మరోపక్క త్రిష విక్టరీ వెంకటేష్ తో కలిసి మరో సినిమా చేస్తుందని టాక్. వెంకీ తో త్రిష ఇప్పటికే 3 సినిమాల్లో నటించగా నాల్గవ సినిమా కూడా కలిసి చేస్తున్నారని టాక్. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వెంకటేష్ చేసే ఈ సినిమా లో త్రిష నటిస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత త్రిష బాలకృష్ణ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో అఖండ 2 త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నారట. ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో త్రిష నటిస్తుందని తెలుస్తుంది. చిరు విశ్వంభర, వెంకటేష్ మూవీ.. బాలకృష్ణ అఖండ 2 ఈ మూడు సినిమాలతో త్రిష తిరిగి టాలీవుడ్ లో సూపర్ ఫాం లోకి వస్తుందని చెప్పొచ్చు.

Also Read : Akhil New Look : అఖిల్ న్యూ లుక్ చూశారా.. వామ్మో అయ్యగారు ఏందయ్యా ఇది..!