Site icon HashtagU Telugu

Tripti Dimri : అలాంటోడినే పెళ్లి చేసుకుంటా.. యానిమల్ బ్యూటీ త్రిప్తి కాబోయే వాడు ఎలా ఉండాలంటే..!

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సందర్భంగా ఆ మూవీలో నటించిన త్రిప్తి డిమ్రి (Tripti Dimri) సూపర్ జోష్ లో ఉంది. సినిమాలో జోయా పాత్రలో ఆమె ఆడియన్స్ మనసులను దోచేసింది. సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక కన్నా త్రిప్తి డిమ్రి కే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చిందంటే నమ్మాలి. సినిమాలో ఆమె కనిపించిన కాసేపు అదరగొట్టేసింది. ఇక ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో త్రిప్తికి వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

సినిమాలతో పాటుగా ఓటీటీలో వెబ్ సీరీస్ లతో హడావిడి చేస్తుంది త్రిప్తి డిమ్రి. అయితే ఈ గ్యాప్ లో త్రిప్తి డిమ్రి పెళ్లి వార్తలపై మీడియాలో హడావిడి ఎక్కువైంది. అమ్మడు త్వరలో పెళ్లి చేసుకుంటుందని న్యూస్ వైరల్ అయ్యింది. అయితే కెరీర్ ఇప్పుడు ట్రాక్ మీదకు రాగా ఇప్పుడప్పుడే పెళ్లేంటని అనుకుంటుంది త్రిప్తి.

తన పెళ్లిపై మీడియాలో వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదని అన్నది. అయితే ఇదే క్రమంలో తనకు కాబోయే వాడి గురించి అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది అమ్మడు. తనకు కాబోయే వాడు మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు.. అతనికి పాపులారిటీ ఉందా లేదా అన్నది చూడను.. డబ్బు ఉందా అన్నది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ మంచి మనసున్న మనిషి కావాలని అంటుంది.

దాదాపు హీరోయిన్స్ అంతా కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తినే ఇష్టపడతారు. ఇక సినిమాలు చేస్తున్నా కదా అని ఓటీటీ ఆఫర్లను వదిలి పెట్టనని రెండిటిని సమానంగా చూస్తానని అంటుంది త్రిప్తి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ వచ్చిందని తెలుస్తుండగా ఆ విషయంపై అమ్మడు స్పందించలేదు.

Also Read : Brahmanandam Nepali Movie : హాస్య బ్రహ్మ హ్రశ్వ ధీర్ఘ.. తెలుగు నేపాలి రిలీజ్.. ఖాతాలో మరో రికార్డ్..!