Item Songs Trend in Movies: సినిమాల్లో ఐటెం సాంగ్స్ ట్రెండ్..!

స్టార్ హీరోయిన్లతో ఐటెం సాంగ్ పెడితే తమ సినిమాకు క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దీంతో ఖర్చుకు వెనకాడకుండా హీరోయిన్లకు భారీగా ముట్టచెప్పేందుకు వెనుకాడటం లేదు.

Published By: HashtagU Telugu Desk
Rashmika

Rashmika

ఇటీవల కాలంలో సినిమాలలో ఐటెం సాంగ్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేకంగా డ్యాన్సర్లు చేసేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెంలకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే శ్రియ నుంచి సమంత వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగుల్లో తళుక్కున మెరిశారు. స్టార్ హీరోయిన్లతో ఐటెం సాంగ్ పెడితే తమ సినిమాకు క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దీంతో ఖర్చుకు వెనకాడకుండా హీరోయిన్లకు భారీగా ముట్టచెప్పేందుకు వెనుకాడటం లేదు. ఒక్కో పాటకు కోటికి పైగా వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఈ జాబితాలో చేరింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకుంటున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇంత వరకు ఐటెం సాంగ్ లేదు. తొలిసారిగా రష్మికతో తన సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

  Last Updated: 29 Nov 2022, 11:37 AM IST