Tollywood: టాలీవుడ్ లో విషాదం, హీరో వేణు తొట్టెంపూడి తండ్రి మృతి

Tollywood: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్‌ కాలనీలోని స్టీల్‌ అండ్‌ మైన్స్‌ కాంప్లెక్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. జూబ్లీహాల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్తను […]

Published By: HashtagU Telugu Desk
Venu Father

Venu Father

Tollywood: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్‌ కాలనీలోని స్టీల్‌ అండ్‌ మైన్స్‌ కాంప్లెక్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. జూబ్లీహాల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు, వేణు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వేణు తండ్రి భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్‌లో ఉన్న స్వగృహంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత అంటే 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు.

కాగా వేణు చివరగా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కనిపించాడు. చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన చిత్రమది. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. అతిథి అంటూ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో వేణు సందడి చేశాడు. ఒకప్పుడు హీరోగా దూసుకెళ్లిన హీరో వేణులో రీఎంట్రీలో మాత్రం కాస్తా వెనుక బడ్డాడని చెప్పక తప్పదు.

  Last Updated: 29 Jan 2024, 01:08 PM IST