ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషాద వార్తను రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఆయన కన్నుమూశారని తెలిపారు. ఈ సంఘటనతో రాహుల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రాహుల్ హృదయానికి దగ్గరైన భావాలను పంచుకున్నారు. “మా నాన్న కష్టపడి పనిచేసేవారు.. నిజాయితీపరులు. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాలలో సజీవంగా ఉంటారు.
CM Chandrababu : యాసిడ్ దాడి ఘటన..తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ రాహుల్ భావోద్వేగపూరితంగా రాశారు. ‘చి లా సౌ’ సినిమా కథ రాస్తున్న సమయంలో తన మనసుకు దగ్గరైన ఓ డైలాగ్ గురించి రాహుల్ ప్రస్తావించారు. “నాన్న ఉన్నారు లే, చూస్కుంటారు” అనే మాటకి నిజమైన విలువ నాన్నను కోల్పోయినవారికే తెలుస్తుందని, ఇప్పుడు తాను ఆ బాధను గుండెల్లో నిలుపుకున్నానని అన్నారు. ఈ విషాదకరమైన వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సన్నిహితులు పరామర్శిస్తున్నారు. ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. అభిమానులు సైతం రాహుల్‌కు ధైర్యం చెబుతున్నారు. రాహుల్ రవీంద్రన్ ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, అనంతరం దర్శకుడిగా, రచయితగా తన ప్రత్యేకతను చూపించారు. ప్రస్తుతం కథారచయితగా, దర్శకుడిగా రాహుల్ సినిమాల్లో తనదైన ముద్ర వేస్తూ కొనసాగుతున్నాడు.