Site icon HashtagU Telugu

Tovino Thomas : టాలీవుడ్ పై మలయాళం హీరో కౌంటర్.. తెలుగు మల్టీస్టారర్ చేస్తే మలయాళంలో నా కెరీర్ ఎండ్ అయిపోతుంది..

Tovino Thomas Counter on Tollywood Films and Heros

Tovino Thomas

Tovino Thomas : మన తెలుగు సినిమాలు ఇటీవల ఏళ్లకు ఏళ్ళు తీస్తున్నారు. గతంలో ఒక్కో హీరో సంవత్సరానికి 5 నుంచి పది సినిమాలు చేస్తే ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా గగనమే అయిపొయింది. మరోపక్క మలయాళం సినిమా మన సినిమాల కంటే తక్కువ బడ్జెట్, తక్కువ డేస్ లో, మంచి కంటెంట్ తో వరుసగా సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పిస్తుంది. తాజాగా మలయాళం హీరో టోవినో థామస్ ఈ విషయంపై ఇండైరెక్ట్ గా తెలుగు వాళ్లకు కౌంటర్ వేసాడు.

టోవినో థామస్ హీరోగా నటించిన ARM సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేసారు. తాజాగా తెలుగులో ARM సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో యాంకర్ టోవినో థామస్ ని తెలుగులో మల్టీస్టారర్ చేస్తారా? తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తారా అని అడిగారు.

దీనికి టోవినో థామస్ సమాధానమిస్తూ.. నేను తెలుగులో సినిమాలు ఫ్యూచర్ లో చేయొచ్చు ఏమో. కానీ తెలుగులో మల్టీస్టారర్ సినిమా చేయలేను. నేను ఇక్కడ మల్టీస్టారర్ సినిమా చేస్తే అక్కడ మలయాళంలో నా కెరీర్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఒక మల్టీస్టారర్ సినిమా చేసే సమయంలో నేను నాలుగైదు సినిమాలు చేస్తాను అక్కడ. అక్కడ మేము ఒకటి, రెండు షెడ్యూల్స్ లోనే సినిమా షూటింగ్ మొత్తం చేసేస్తాము. ఇక్కడ నేను మల్టీస్టారర్ ఒప్పుకుంటే అక్కడ నా సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి అని అన్నారు. దీంతో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అంతే కాకుండా ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. మన తెలుగులో స్టార్ హీరోలో ఒక్కో సినిమా ఏళ్ళ తరబడి చేస్తున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ గా టోవినో థామస్ ఇక్కడ డేట్స్ ఇస్తే మన హీరో డేట్స్ బట్టి సినిమా సాగుతూనే ఉంటుంది. ఈ లోపు టోవినో థామస్ అక్కడ ఒక నాలుగు సినిమాలు తీసేయొచ్చు అనే ఉద్దేశంతో చెప్పాడు. అయితే దీనిపై పలువురు టోవినో థామస్ ని విమర్శిస్తుంటే మరికొంతమంది మాత్రం ఈ హీరో చెప్పింది కరెక్ట్ కదా అని అంటున్నారు.

 

Also Read : Devara Trailer : దేవర ట్రైలర్ వచ్చేసింది.. షాట్స్ అదిరిపోయాయిగా..