Sankranti Box Office: థియేటర్ల కోసం టాలీవుడ్ యుద్ధం.. సంక్రాంతి బరిలో నెగ్గేదెవరు!

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. అందుకు చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్స్ పండుగ సందర్భంగా తమ తమ సినిమాలను రిలీజ్

  • Written By:
  • Updated On - November 12, 2022 / 01:16 PM IST

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. అందుకు చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్స్ పండుగ సందర్భంగా తమ తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే సంక్రాంతో బరిలో డబ్బింగ్ (ఇతర భాషలు) సినిమాలు సైతం సందడి చేస్తున్నాయి. గతేడాది సంక్రాంతి సీజన్‌లో డబ్బింగ్ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై చర్చలు జరిగాయి. ఇప్పుడు 2023లోనూ సీన్ రిపీట్ కాబోతోంది. విజయ్ వరిసు నిర్మాత అయిన దిల్ రాజు ఈ చిత్రం కోసం నైజాం, వైజాగ్ ప్రాంతాలలో చాలా థియేటర్స్ ను ముందే బుకింగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాల్టేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహా రెడ్డి ఈ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలు.

వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు వరిసు (వారసుడు) సమానస్థాయిలో స్క్రీన్‌లు కేటాయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో దిల్ రాజుకు ఉన్న పట్టు దీనికి కారణం. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు వైపు మాత్రమే టాలీవుడ్ ఎగ్జిబిటర్లు వాటిని ప్రదర్శించడానికి ఇష్టపడతారు. కానీ వరిసు కోసం ఇప్పట్నుంచే అగ్రిమెంట్లు చేస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డిని నిర్మిస్తోంది.  రెండు చిత్రాలను వారి స్వంతంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజన్‌లో స్క్రీన్‌ల కేటాయింపులో గట్టి యుద్ధం ఉంటుంది.

అజిత్ ‘తునివు’ కూడా  సంక్రాంతి సీజన్ లోనే విడుదలవుతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నారు. అంటే 2023 సంక్రాంతికి, రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలుతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ పండుగకు తెలుగు సినిమాలే కాకుండా డబ్బింగ్ సినిమాలు పోటీలోకి రానున్నాయి. ఇవే కాకుండా ఒకటి రెండు చిన్న చిన్న సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ సంక్రాంతికి ఆ సినిమాలన్నింటికి థియేటర్స్ దొరకడం కష్టమేనని అంటున్నారు టాలీవుడ్ ఎగ్జిబ్యూటర్స్. అయితే అటు బాలయ్య, ఇటు చిరంజీవి, మరోవైపు విజయ్ సినిమాలు విడుదలయ్యే నేపథ్యంలో చివరి నిమిషంలో రిలీజ్ డేట్స్ మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.