Junior NTR Emotional Tweet: తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ జూ.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ (Junior NTR Emotional Tweet) రిలీజ్ చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ‘ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ తారక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ముందే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
— Jr NTR (@tarak9999) May 28, 2024
ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తమ స్పందనలను తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
Also Read: Mukesh Ambani Plan: ముఖేష్ అంబానీ నయా ప్లాన్.. ఆఫ్రికాలో అడుగుపెట్టేందుకు సిద్ధం..!
ఎన్టీఆర్ ఓ శక్తి: బాలకృష్ణ
టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదు శక్తి అని ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తన సోదరుడు రామకృష్ణతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.
జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు: లక్ష్మీ పార్వతి
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి NTR ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..‘‘ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ CMగా ప్రమాణం చేస్తారు. APలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అన్నారు.
We’re now on WhatsApp : Click to Join
NTR నాకు రాజకీయ దేవుడు: ఎర్రబెల్లి
ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. NTR తన రాజకీయ దేవుడు అన్నారు.
తాను మొదటి నుండే కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. మండల వ్యవస్థ.. అనేక పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపించారు. NTRకి భారత రత్న ఇవ్వాలి అని కోరారు.