Site icon HashtagU Telugu

Srileela : శ్రీలీలకి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నారా..?

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

రెండు సినిమాలతోనే సూపర్ స్టార్ డం తెచ్చుకుని ఒకేసారి ఏడు ఎనిమిది సినిమాలు చేసిన శ్రీ లీల (Srileela) ఆ సినిమాల ఫలితాలతో కెరీర్ తలకిందులు చేసుకుంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని కథల విషయంలో పెద్దగా పట్టించుకోని శ్రీ లీల దానికి తగిన ఫలితం అనుభవిస్తుంది. లాస్ట్ ఇయర్ రిలీజైన నాలుగు సినిమాల్లో ఒకటి హిట్ అవ్వగా 3 ఫ్లాపులే అయ్యాయి.

We’re now on WhatsApp : Click to Join

ఈ ఇయర్ గుంటూరు కారం ఒకటి హిట్ అవ్వగా ఆ హిట్ క్రెడిట్ కూడా మహేష్ బాబు ఖాతాలోనే వేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల చేసిందేమి లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. మహేష్ బాబే ఒంటి చేత్తో గుంటూరు కారం నడిపించాడని తెలిసిందే. శ్రీ లీల డ్యాన్సులు వరకు మాత్రమే అన్న టాక్ వచ్చేసింది.

ఇక ఇదే క్రమంలో వరుస సినిమాలు చేస్తుందని ఒక నిర్మాత శ్రీ లీలకు అడ్వాన్స్ ఇచ్చాడట. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమెను తొలగించి ఆ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని అంటున్నాడట. తెలుగు అమ్మాయి ఇన్నాళ్లకు స్టార్ డం తెచ్చుకుందని సంబరపడితే ఆమె కూడా ఇలా కెరీర్ మొదట్లోనే వరుస ఫ్లాపులు తెచ్చుకోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. శ్రీ లీల కాదన్న ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ చాన్స్ అందుకుంటారు. ఇంతకీ శ్రీ లీలను కాదన్న ఆ నిర్మాత ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

Also Read : Raviteja Sitara Entertainments : రవితేజతో సితార ఎంటర్టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరు..?