Site icon HashtagU Telugu

Highest-Paid Actors: ఇండియాలో అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టులు వీరేనా.. టాప్‌లో ఐకాన్ స్టార్‌!

Highest-Paid Actors

Highest-Paid Actors

Highest-Paid Actors: భార‌తీయ చ‌ల‌న‌చిత్ర సీమ ప‌రిశ్ర‌మ‌లో 2024లో అత్య‌ధిక పారితోషికం (Highest-Paid Actors) తీసుకున్న న‌టుల జాబితాను ఓ సంస్థ విడుద‌ల చేసింది. అయితే అందులో టాప్‌-10 యాక్ట‌ర్స్ లిస్ట్ ఉంది. ఆ సంస్థ విడుద‌ల చేసిన ప్ర‌కారం.. అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకునే జాబితాలో టాప్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉండటం గ‌మ‌నార్హం. టాప్‌-10లో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఉన్నాడు. అయితే బ‌హుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని గ్లోబ‌ల్ లెవెల్‌కు తీసుకెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌భాస్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. తెలుగు నుంచి కేవ‌లం ఈ ఇద్ద‌రూ హీరోలు మాత్ర‌మే ఈ లిస్ట్‌లో చోటు ద‌క్కించుకున్నారు.

ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌-2 మూవీ నుంచి రూ. 300 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఉన్నారు. ఆయన ప్ర‌తి సినిమాకు రూ. 130కోట్ల నుంచి రూ. 275 కోట్లు ఛార్జ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఆయ‌న ప్ర‌తి సినిమాకు రూ. 150 కోట్ల నుంచి రూ. 250 కోట్లు పారితోషికం అందుకుంటున్నార‌ట‌. ఇక నాలుగో స్థానంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఉన్నారు. ఆయన సినిమాకు రూ. 125 కోట్లు నుంచి రూ. 275 కోట్లు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఇక‌పోతే ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ రూ. 100 కోట్ల నుంచి రూ. 275 కోట్లు తీసుకుంటార‌ని తెలుస్తోంది.

Also Read: AP New CS: ఏపీ సీఎస్‎గా విజయానంద్ నియామకం!

ఈ లిస్ట్‌లో టాప్‌-6లో ఉన్న పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లు తీసుకుంటాడ‌ని తెలుస్తోంది. 7వ స్థానంలో ఉన్న హీరో అజిత్ రూ. 105 కోట్ల నుంచి రూ. 165 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకుంటారు. ఇక‌పోతే టాప్‌-8లో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయ‌న ఒక్కో సినిమాకి రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు తీసుకుంటార‌ని స‌మాచారం. తొమ్మిది స్థానంలో ఉన్న క‌మ‌ల్ హాస‌న్ ఒక్కో మూవీకి రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు తీసుకుంటుండ‌గా.. టాప్-10లో ఉన్న అక్ష‌య్ కుమార్ ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ. 145 కోట్లు ఛార్జ్ చేస్తార‌ని తెలుస్తోంది.