Site icon HashtagU Telugu

Celebrity Weddings 2024 : అనంత్ అంబానీ నుంచి నాగ చైతన్య దాకా.. 2024లో పెళ్లయిన సెలబ్రిటీలు వీరే

Celebrity Weddings 2024 Movies Lookback 2024 Entertainment Lookback 2024

Celebrity Weddings 2024 : 2024 సంవత్సరంలో పలువురు సెలబ్రిటీలకు వివాహ యోగం పట్టింది. వాళ్లంతా ఒక ఇంటి వాళ్లయ్యారు. అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నుంచి మొదలుకొని తెలుగు సినీ ప్రియుల మది దోచిన రకుల్ ప్రీత్ దాకా పలువురు సెలబ్రిటీలకు మ్యారేజ్ జరిగింది. వారి వివాహాల గురించి ఇంటర్నెట్‌లో వాడివేడి చర్చ నడిచింది.   ఆ విశేషాలను ఓసారి చూద్దాం..

Also Read :China Warning : నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్

  •  ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్‌కు బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్‌‌తో డిసెంబరు 12న పెళ్లి జరిగింది. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ ఇద్దరి పెళ్లి గోవాలో తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. అనంతరం క్రైస్తవ పద్ధతిలో కూడా జరిగింది.
  • హీరోయిన్ తాప్సీ ఈ ఏడాది మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మథియాస్ బో అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి తాను 2023 డిసెంబర్‌లోనే మథియాస్‌ను లీగల్‌గా పెళ్లి చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వేడుకలో  డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కనికా ధిల్లాన్, పావైల్ గులాటి వంటి కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు.
  • హీరోయిన్ అదితి రావు హైదరికి ఈ ఏడాది సెప్టెంబరు 16న పెళ్లి జరిగింది. ఆమె హీరో సిద్ధార్థ్‌ను పెళ్లాడారు. తెలంగాణలోని వనపర్తిలో ఉన్న చారిత్రక శ్రీరంగనాయకస్వామి ఆలయంలో వీరి మ్యారేజ్ జరిగింది.
  • హీరోయిన్ కృతి కర్బంద ఈ ఏడాది మార్చి 15న పుల్కిత్ సామ్రాట్‌ను పెళ్లాడారు. వీరి పెళ్లి హర్యానాలోని మానేసర్‌లో జరిగింది.
  • అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్‌కు ఈ ఏడాది జనవరి 3న మ్యారేజ్ జరిగింది. ఆమె నుపుర్ శిఖరే‌ను పెళ్లాడారు. తొలుత వీరు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.  అనంతరం ఉదయ్‌పూర్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మ్యారేజ్ కమ్ రిసెప్షన్ నిర్వహించుకున్నారు.