Mahesh Babu : పాపం మహేష్ కు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు రాజమౌళి..!!

Mahesh Babu : వాస్తవానికి మహేష్ తాను నటించే సినిమా షూటింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే ఫ్యామిలీ టూర్ వెళ్తుంటాడు. కానీ రాజమౌళి సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఆలా కుదరడం లేదు.

Published By: HashtagU Telugu Desk
Ss Rajmouli Mahesh

Ss Rajmouli Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahaesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) సినిమా రొమాంటిక్ టచ్‌తో కాకుండా యాక్షన్, అడ్వెంచర్, గ్లోబల్ స్కేల్‌లో రూపొందుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి ఒక వీడియో ద్వారా పాస్‌పోర్ట్‌ను తన చేతిలో చూపించి ఆసక్తిని కలిగించారు. ఆ వీడియోలో మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసినట్లు హ్యుమరస్‌గా చూపించగా, తర్వాత మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్‌లో పాస్‌పోర్ట్ చూపిస్తూ తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి మహేష్ బాబు తన పాస్‌పోర్ట్ సరెండర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఆయన తదుపరి షెడ్యూల్ కోసం విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

Indiramma Houses: కేసీఆర్ ద‌త్త‌త గ్రామం వాసాలమ‌ర్రిలో అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు!

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఇందులో మహేష్ బాబు పాల్గొంటుండగా, ఇతర ముఖ్య తారాగణం కూడా చిత్రీకరణలో భాగమవుతున్నారు. రాజమౌళి స్టైల్‌కు తగ్గట్లుగా సాంకేతికంగా, విజువల్స్ పరంగా గ్రాండ్ లెవెల్‌లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు పది రోజుల పాటు కొనసాగనుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత తదుపరి దశలో ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లొకేషన్‌కు వెళ్లనుంది.

Indigo Flight Gate Locked: మ‌రో విమానంలో సాంకేతిక లోపం.. ఆ స‌మ‌యంలో ప్లైట్‌లో మాజీ సీఎం!

హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన వెంటనే మహేష్ బాబు, రాజమౌళి టీమ్ మొత్తం ఆఫ్రికాలోని కెన్యాకు పయనమవుతుంది. కెన్యాలో ఒక నెలపాటు ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. వాస్తవానికి మహేష్ తాను నటించే సినిమా షూటింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే ఫ్యామిలీ టూర్ వెళ్తుంటాడు. కానీ రాజమౌళి సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఆలా కుదరడం లేదు. షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే మరో షెడ్యూల్ మొదలు అవుతుండడం తో మహేష్ ఈసారి ఫ్యామిలీ ట్రిప్ లేకుండా అవుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, విలన్ పాత్రకు మాధవన్ లేదా విక్రమ్‌లలో ఎవరు ఫైనల్ అవుతారు అనేది ఇంకా స్పష్టత లేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ మీద ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.

  Last Updated: 19 Jun 2025, 11:58 AM IST