ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉదయం నుండి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తు కడసారి రామోజీరావు ను చూసి..ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని మోడీ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్త్రులు , రాజకీయ పార్టీల అధినేతలు , వివిధ పార్టీలకు చెందిన నేతలు , సినీ కళాకారులు ఇలా ప్రతి ఒక్కరు రామోజీ రావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ..ఓ లెజెండ్ ను కోల్పోయామని బాధపడుతున్నారు. రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. సంతాప సూచికగా రేపు (ఆదివారం) సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఇక రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also : Re KYC : బ్యాంకు అకౌంటుకు రీ కేవైసీ చేసుకోవాలా ? చాలా ఈజీ