Site icon HashtagU Telugu

Jr. NTR New Look: మ్యాన్ ఆఫ్ మాసెస్.. సరికొత్త లుక్ లో ఎన్టీఆర్, పిక్స్ వైరల్!

Jr Ntr

Jr Ntr

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లెటెస్ట్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు అటు ఫ్యాన్స్ ను, ఇటు నెటిజన్ల మనసులను దొచుకుంటున్నాయి. ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో చూడొచ్చు. మ్యాన్లీ లుక్స్ తో వావ్ అనిపించేలా కనిపించాడు.

అలీమ్ ఖాన్ తన పోస్ట్‌కి “Man of Masses @jrntr… A New Day, A New Vibe… A New Style” అని క్యాప్షన్ ఇచ్చారు. ఎన్టీఆర్ నీలిరంగు డెనిమ్ చొక్కా, గాగుల్స్‌లో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో స్టైలిస్ట్ అలీమ్ ఖాన్‌తో కలిసి ఒక చిత్రాన్ని కూడా షేర్ చేశారు. అతను తన పోస్ట్‌కి “ఒక కొత్త రోజు, కొత్త వైబ్స్, ఆలిమ్ హకీమ్ తో నేనూ” అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెల్ లో వైరల్ గా మారాయి.