Site icon HashtagU Telugu

Sreeleela: శ్రీలీలకు అప్పుడే పెళ్లా.. నో ఛాన్స్!

Sreeleela exclusive dhamaka

Sreeleela

Sreeleela: మోస్ట్ హ్యాపీనింగ్ నటి శ్రీలీల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో ఊహాగానాలు చెలరేగాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ పుకార్లలో నిజం లేదని శ్రీలీల టీమ్ ఖండించింది. “శ్రీలీల తన సినిమా కెరీర్‌తో పాటు తన చదువుతో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఆమెకు ప్రేమ, పెళ్లికి సమయం లేదు. కాబట్టి, ఈ ఊహాగానాలను నమ్మవద్దు, ”అని నటికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. శ్రీలీల భగవంత్ కేసరి, ఆదికేశవ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, అయితే ఆమె గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమె ఖాతాలో మరికొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

ఇటీవల భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో ఓ ఫొటోలో కనిపించింది శ్రీలీల. దీంతో గాసిప్స్, రూమర్స్ తెగ పుట్టుకొచ్చేశాయి. బాలకృష్ణ కొడుకుతో శ్రీలీల పెళ్లికి రెడీ అయిందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ వార్తలపై శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న తనపై ఇలాంటి వార్తలు వచ్చేసరికి తాను కాస్త డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. పెళ్లి అంటూ వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.. వాటి గురించి రాసేటప్పుడు నిజం తెలుసుకోవాలని సలహా కూడా ఇచ్చిందట.

పెళ్లి సందD మూవీతో తెలుగు వారికి పరిచయమైను అందాల భామ శ్రీలీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేసిన ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీలకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఆమె తెలుగు దర్శకులు దృష్టిలో పడింది. తర్వాత మాస్ మహరాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా మూవీతో ఒక ఊపు ఊపేసింది. ఇందులో రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా నటించి, డ్యాన్స్ చేసి యూత్ మనసు గెలిచేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

Exit mobile version