Site icon HashtagU Telugu

Priya Anand & Nithyananda: నిత్యానంద ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్!

Priya Anand

Priya Anand

తమిళనాడులోని అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో నిత్యానంద స్వామి ఒకరు. గతంలో నటి రంజితతో అత్యంత సన్నిహితంగా ఉన్న అశ్లీల దృశ్యాలు చాలా సంచలనాలకు కారణమయ్యాయి. దీంతో ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు పోయింది. ఆ తర్వాత ఆయనపై మీడియాలో అనేక వివాదాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా అతనిపై కిడ్నాప్, మోసం ఫిర్యాదులతో పాటు అనేక కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన చుట్టూ చాలా మంది శిష్యులు ఉన్నారు. అతని వద్ద విలువైన బంగారు కడ్డీలు, చాలా డబ్బు కూడా ఉన్నాయి. ఆయన ఆశ్రమానికి తమిళనాడు నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి బస చేస్తారు. కొద్దిరోజుల క్రితం నిత్యానంద కోమాలోకి వెళ్లి చనిపోయారని చాలా వార్తలు వచ్చాయి. కానీ నిత్యానంద దానిని ఖండించి తాను బాగానే ఉన్నానని చెప్పి తనపై వచ్చిన రూమర్లకు స్వస్తి పలికాడు.

వామనన్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన నటి ప్రియా ఆనంద్, నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. నిత్యానంద స్వామి అంటే నాకు చాలా ఇష్టమని, ఆయనపై నాకు అమితమైన ప్రేమ ఉందని అన్నారు. నేను అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా చేస్తే, నా పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రియా ఆనంద్, నిత్యానంద్ పేర్లు బాగా సరిపోతాయి. అందుకే నా పేరు మార్చుకోవడానికి కూడా నాకేమీ ఇబ్బంది లేదు అంటూ సోషల్ మీడియాలో చాలా ఓపెన్ గా చెప్పి చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ ప్రియా ఆనంద్ లీడర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Exit mobile version