Site icon HashtagU Telugu

Akkineni Vs Nandamuri: అక్కినేని తొక్కినేని.. టాలీవుడ్ లో ‘వారసుల’ వార్

Tollywood

Tollywood

టాలీవుడ్ లో వారసుల రచ్చ మళ్లీ మొదలైంది. బాలయ్య కామెంట్స్ తో ‘నందమూరి వర్సెస్ అక్కినేని’ (Akkineni Vs Nandamuri) అన్నట్టుగా సీన్ మారింది. ఇటీవల జరిగిన విజయోత్సవ వేడుకలో బాలయ్య ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలు తలెత్తాయి. బాలకృష్ణ ఒక ప్రవాహంలాగా మాట్లాడేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు (Hard Comments) చేశారు. ఇప్పుడు కేసులు పెట్టడం చాలా తేలిక అంటూ ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక బాలయ్య చేసిన మరో కామెంట్ తీవ్ర వివాదంగా మారుతోంది. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు. వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు,, ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని అన్నారు. అయితే ఇప్పటి వరకు రెండు కుటుంబాల పరిమితమైన ఈ ఇష్యూ టాలీవుడ్  (Tollywood) లో మరింత దుమారం రేపే అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు.

అక్కినేని తొక్కినేని

ఇక్కడ బాలయ్య అక్కినేని తొక్కినేని అని అనడంతో అక్కినేని అభిమానులు (Akkineni Fans) తీవ్రంగా తప్పు బడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడమేనా అని వివమర్శిస్తున్నారు. నిత్యం తండ్రి జపం చేసే బాలయ్య.. ఇతర లెజెండ్స్ కి కూడా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అని దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ వైరల్ కావడంతో బాలయ్య అభిమానులు కూడా రియాక్ట్ అయ్యారు. అక్కినేని లాంటి లెజెండ్ హీరోను అగౌరవపర్చడం సరికాదు అని నందమూరి అభిమానులు (Akkineni Vs Nandamuri) సైతం ఘాటుగానే స్పందించారు. బాలయ్య ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలో ఓ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య మహిళల గురించి చేసిన కామెంట్స్ ఎంత వివాదం సృష్టించాయో తెలిసిందే.

అక్కినేని వారసుల రియాక్షన్
సినీ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై (Akkineni Vs Nandamuri) అక్కినేని నాగచైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు హీరో అఖిల్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. ఈ ఇద్దరు ఒకేసారి ట్వీట్ చేయడం కూడా మరింత చర్చనీయాంశమవుతోంది. అక్కినేని హీరోలు వరుసగా ట్వీట్స్ చేయడంతో ఈ అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు తమ తండ్రి నాగార్జున (Nagarjuna)తో కలిసి చర్చించి ఈ విధంగా ట్వీట్ చేసి ఉంటారని టాలీవుడ్ లో పలువురు భావిస్తున్నారు.

Also Read: Jagan-CBN : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఫ‌ల్యాలే చంద్ర‌బాబు విజ‌యానికి మెట్లు