Site icon HashtagU Telugu

Chandrika Ravi: అరుదైన ఘనత.. అమెరికాలో రేడియో షోకు వ్యాఖ్యాతగా తొలి భారతీయ నటి

Chandrika

Chandrika

Chandrika Ravi: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ వంటి చిత్రాల్లో తన నటన, డాన్స్ మూవ్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన చంద్రికా రవి ఇప్పుడు తన సినీ కెరీర్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. భారత సంతతికి చెందిన ఈ ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి షో అనే అమెరికన్ రేడియో టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.

ఆమె ఎల్లప్పుడూ తనలోని ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తుంది. రుకస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఒక ఆఫర్ తో ఆమెను సంప్రదించాడు. తన జీవితాన్ని, అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఇదొక మంచి వేదిక కావడంతో ఈ అవకాశం దక్కడంతో ఆనందంలో మునిగితేలింది. ” కొన్నేళ్లుగా స్వంత టాక్ షో కోసం పని చేస్తున్నాను, చివరికి నాకు లభించింది” అని రేడియో టాక్ షో సహనిర్మాత కూడా అయిన చంద్రిక ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలోని అతిపెద్ద నెట్ వర్క్ లలో ఒకటైన ఐహార్ట్ రేడియోలో ఈ షో విడుదలవుతోంది.

‘‘ఈ షో తన బిడ్డ లాంటిదని, అందుకే దాని డిజైనింగ్ తో సహా షోకు సంబంధించిన ప్రతి అంశాన్నీ తాను చూసుకుంటానని చెప్పింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్స్ లో చాలా వరకు నేనే ఎడిట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. ‘ఇదొక గొప్ప అనుభవం. కొంచెం ఒత్తిడితో కూడుకున్నది, కానీ లాభదాయకం’’  అని ఆనందం వ్యక్తం చేసింది.