Site icon HashtagU Telugu

Mohan Babu Attack On Manoj: మంచు మనోజ్‌పై మోహ‌న్ బాబు దాడి.. నిజం ఏంటంటే?

Manchu Manoj Fight

Manchu Manoj Fight

Mohan Babu Attack On Manoj: టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేగింది. మా అధ్య‌క్షుడు మంచు విష్ణు, మ‌నోజ్‌ల మ‌ధ్య వివాదాలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ఓ వివాదంతో మంచు కుటుంబంలో వివాదాలు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. తాజాగా మోహన్ బాబు కుటుంబంలో గొడ‌వ‌లు పోలీస్ స్టేష‌న్‌కు చేరాయి. కుటుంబంలోని వ్య‌క్తులు పోలీస్ స్టేష‌న్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

అస‌లేం జ‌రిగింది?

నటుడు మోహన్ కుటుంబంలో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి (Mohan Babu Attack On Manoj) చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపైనే మనోజ్ దాడి చేసినట్లుగా మోహన్‌బాబు సైతం ఫిర్యాదు చేశారు. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ గాయాలతోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విష‌యంపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది. నిజంగానే మోహ‌న్ బాబు.. మ‌నోజ్‌పై దాడి చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: CM Revanth Tweet : తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. తొలి ఏడాది సక్సెస్ : సీఎం రేవంత్

మోహ‌న్ బాబు కుటుంబం క్లారిటీ

మోహన్ బాబు- మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథ‌నాలను.. కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలను న‌మ్మ‌కండి అని మంచు మోహన్ బాబు కుటుంబం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

గ‌తంలో కూడా మంచు కుటుంబంలో లుక‌లుక‌లు

గ‌తంలో కూడా మంచు కుటుంబంలో వివాదాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మా అధ్య‌క్షుడు, హీరో మంచు విష్ణు.. మంచు మ‌నోజ్‌పై దాడికి ప్ర‌య‌త్నించిన‌ట్లు ఓ వీడియోను స్వ‌యంగా మ‌నోజే విడుద‌ల చేయడం అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే అది ఓ షో కోసం చేసిన వీడియో అని మంచు విష్ణు ఓ ప్రెస్ మీట్‌లో స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత రియాల్టీ షో చేస్తున్న‌ట్లు ఓ టీజ‌ర్ కూడా వ‌దిలారు. అయితే అప్పుడు కూడా ఆస్తుల విష‌యంలోనే గొడ‌వ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మ‌నోజ్ మాత్రం ఈ విష‌యంపై అప్ప‌ట్లో ఘాటుగానే స్పందించారు. వ్య‌క్తిగ‌త విష‌యాలు మీకెందుకు అన్న‌ట్లు ప్ర‌శ్నించారు.

ఇక‌పోతే ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు ఆయ‌న కొడుకు మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న క‌న్న‌ప్ప‌లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల నాని మూవీలో కూడా ఓ పాత్ర‌కు ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.