Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ కు ట్విట్టర్ షాక్.. బ్లూటిక్ మాయం!

బ్లూ టిక్‌లు కోల్పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం.

  • Written By:
  • Updated On - April 21, 2023 / 11:43 AM IST

ఎప్పుడైతే ఎలన్ మస్క్ (Must) ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారో.. చిత్ర విచిత్ర సంఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ (Twiiter) తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తుండగా, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ట్విట్టర్ సీఈఓ  ఇప్పటికే ప్రకటించిన విధంగా నెలవారీ లేదంటే ఏడాది చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌లు ఎగిరిపోయాయి. అయితే, ఇలా బ్లూ టిక్‌లు కోల్పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు (Tollywood Stars), రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం.

ఇండివిడ్యువల్ ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్లు కావాలనుకుంటే వెబ్ కోసం అయితే నెలకు రూ.650, యాప్ కోసమైతే నెలకు రూ.900 చెల్లించాలి. ఏడాదికైతే రూ.6500 డిస్కౌంట్ ఆఫర్‌ను ట్విట్టర్ అందిస్తోంది. అంటే నెలకు రూ.566 మేర తగ్గింపు ఉంటుంది. దీనికి తుది గడువును ఈ ఏడాది ఏప్రిల్ 20 వరకు విధించారు. ఈ లోపల బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోనివారు దాన్ని కోల్పోతారు. ట్విట్టర్ (Twiiter) సీఈఓ ఎలన్ మస్క్ ప్రకటించినట్టుగానే గురువారం నుంచి వరుసగా సెలబ్రిటీలు తమ ట్విట్టర్ బ్లూ టిక్‌లను కోల్పోతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ (Megastar) చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్ కోల్పోయారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు కోల్పోకపోవడం విశేషం. ఇక బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ సైతం (Twiiter) టిక్స్ కోల్పోయారు.

Also Read: Karnataka Elections: క‌ర్నాట‌క ఎన్నిక‌ల బ‌రిలో బిచ్చగాడు.. భిక్షాటనతో నామినేషన్!