ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిమృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో శోకసంద్రంలోకి వెళ్లింది. దివికెగిన సిరి‘వెన్నెల’ అంటూ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆయన కు నివాళి అర్పించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లోఉంచారు. ఆయన కడసారి చూపు కోసం వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. ఇప్పటికే ఆయన అంతిమయాత్ర మొదలైంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ తోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్, శ్రీకాంత్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, శర్వానంద్, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి పేర్ని నాని, సజ్జనార్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ఒకే వయసువాళ్లం కావడం వలన, మిత్రమా అంటూ నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటి సిరివెన్నెలను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నేను కాల్ చేసినప్పుడు కూడా ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడితే, కోలుకుంటారనే అనుకున్నాను. తెలుగు సాహిత్యానికి ఒక చీకటి రోజును మిగిల్చి వెళ్లారు. ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి.
“సిరివెన్నెల సరస్వతీ పుత్రుడు .. నాకు అత్యంత సన్నిహితుడు .. విధాత తలపున ప్రభవించిన ఒక సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ నివాళులు అర్పించారు మోహన్ బాబు.
సిరి వెన్నెల మరణం సినీపరిశ్రమకే కాదు, సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన మరణం వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటే. నా పట్ల ఆయన ఎంతో ఆత్మీయతను కనబరిచేవారు. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయవాదం .. సామ్యవాదం వరకూ అన్ని అంశాలను గురించి తన పాటల్లో చెప్పేశారు.. అంటూ సంతాపం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
శాస్త్రిగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. మరోవైపు సిరివెన్నెలను కడసారి చూసుకోవడానికి వందల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో నివాళి అర్పిస్తున్నా… మహేశ్ బాబు