Site icon HashtagU Telugu

Tollywood Stars Diwali Celebrations : తారల దీపావళి పండుగ కన్నుల నిండుగా..!

Tollywood Stars Diwali Celebrations Vishwak Sen Allu Arjun Vijay Devarakonda

Tollywood Stars Diwali Celebrations Vishwak Sen Allu Arjun Vijay Devarakonda

Tollywood Stars Diwali Celebrations దీపాల పండుగ దీపావళి వచ్చింది అంటే అందరు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ సందర్భంగా సెలబ్రిటీస్ కూడా వారి ఫ్యామిలీస్ తో పండుగ జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఫ్యామిలీతో విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. చేతితోనే పెద్ద షాట్ బాక్స్ ని పేల్చుతూ ఇది కదా మాస్ అంటే అనేలా చేశాడు. విశ్వక్ సేన్ షాట్స్ కాల్చడం చూసి విక్రం సినిమాలో క్లైమాక్స్ గుర్తొస్తుందని చాలా మంది కామెంట్స్ చేశారు.

అల్లు అర్హతో అల్లు అరున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అల్లు అర్హతో కలిసి పండుగ జరుపుకున్నారు. గారాల పట్టి అల్లు అర్హతో దీపావళి సంబరాలను జరుపుకున్నారు అల్లు అర్జున్. కూతురు క్రాకర్స్ వెలుతురు చూస్తుందో లేదో అని అల్లు అర్జున్ తన కళ్లజోడు ఇచ్చాడు. ఎంతైనా కూతురు అంటే తండ్రికి ఆమాత్రం ప్రేమ ఉంటుంది కదా.

కొత్త జంటతో దీపావళి పండుగ

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈమధ్యనే ఒక ఇంటి వారు కాగా వారిద్దరు ఈ దీపావళి పండుగ జరుపుకున్నారు. వరుణ్ తేజ్ లావణ్యతో పాటుగా నిహారిక కూడా దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నది.

విజయ్ రష్మిక కలిసి..?

విజయ్ దేవరకొండ తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్మిక కూడా పండుగ సందర్భంగా ఒక ఫోటో షేర్ చేసి ఫ్యాన్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అయితే నెటిజెన్లు మాత్రం ఇద్దరి బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉంది. విజయ్ రష్మిక ఇద్దరు కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారంటూ హడావిడి చేస్తున్నారు.