Anushka Shetty: హమ్మయ్య ఎట్టకేలకు కెమెరా ముందుకి వచ్చిన స్వీటీ.. పిక్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఈమె నవీన్ పొలిచిట్టి నటించిన సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే అనుష్క శెట్టి కొన్నాళ్లుగా మీడియాకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎలా ఉందనేది స్పష్టత లేకపోయింది. దీంతో ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారుపడ్డారు. అయితే ఆ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 12 Mar 2024 02 41 Pm 1325

Mixcollage 12 Mar 2024 02 41 Pm 1325

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఈమె నవీన్ పొలిచిట్టి నటించిన సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే అనుష్క శెట్టి కొన్నాళ్లుగా మీడియాకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎలా ఉందనేది స్పష్టత లేకపోయింది. దీంతో ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారుపడ్డారు.

అయితే ఆ మధ్యలో బరువు కారణంగా అనుష్క పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది. తాజాగా అనుష్క శెట్టి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో తను నటించిన కొత్త చిత్రం యూనిట్ తో ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోలో అనుష్క అందంగా, నిర్మలంగా కనిపిస్తోంది. ఆమె నిండు వైభవంగా, ఆనందంగా, నవ్వుతూ కనిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

ఆమె ఆరోగ్యంగా ఉందని తేలిపోయింది. చాలా కాలం తర్వాత తమ అభిమాన నటిని చూడడంతో ఆమె అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన మలయాళ హారర్-ఫాంటసీ డ్రామా కథనార్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. తాజాగా ఈమె తమిళ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో చిత్రబంధం ఆమెకు పూల బొకే ఇచ్చి మరి ఆమెకు గ్రాండ్ గా వెల్కం చెప్పారు.

  Last Updated: 12 Mar 2024, 02:44 PM IST