Tollywood Star సందీప్ వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. ఈ సినిమాను టీ సీరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ప్రీ టీజర్, టీజర్ రెండు సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేశాయి. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ తన పాత్రలోని వేరియేషన్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. అయితే యానిమల్ టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు వద్దన్నారు అన్న టాక్ నడుస్తుంది. ఇంతకీ యానిమల్ కథ ఏ హీరో వద్దన్నాడు అంటే మన సూపర్ స్టార్ మహేష్ అని అంటున్నారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ వంగ (Sandeep Reddy Vanga) మహేష్ తో ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా ఎందుకో సెట్స్ మీదకు వెళ్లలేదు. మహేష్ కు సందీప్ చెప్పిన కథ యానిమల్ సినిమాదే అని మహేష్ అది తనకు సూట్ అవ్వదనే రిజెక్ట్ చేశాడని అంటున్నారు. యానిమల్ టీజర్ చూశాక మహేష్ ఈ సినిమాను వదిలేయడమే బెటర్ అనుకున్నారు. కొన్ని కథలు కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయి.
మహేష్ ని రణ్ బీర్ (Ranbir Kapoor) పాత్రలో ఊహించడం కష్టం. అయితే మహేష్ ఈ కథ ఓకే చేసి ఉంటే అది మరోలా ఉండేదని కూడా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ పడితే మహేష్ ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయిన వాడు అవుతాడు. ప్రస్తుతం మహేష్ (Mahesh Babu) త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా లైన్ లో ఉంది.
మహేష్ తో షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్ తో సందీప్ వంగ సినిమా ప్లానింగ్ లో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సందీప్ యానిమల్ కథనే మహేష్ కి చెప్పాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. నిజంగానే మహేష్ యానిమల్ ని కాదన్నాడా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Ram Skanda : టాక్ తో సంబంధం లేని వసూళ్లు.. స్కంద ఫస్ట్ డే ఎంత తెచ్చిందంటే..!