Site icon HashtagU Telugu

Prabhas: ప్రభాస్ రాజాసాబ్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే?

Prabhas Ed5d7e8a2e V Jpg 799x414 4g

Prabhas Ed5d7e8a2e V Jpg 799x414 4g

టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది సలార్ సినిమాలో నటించి మెప్పించిన ప్రభాస్ ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే ఊపుతో మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజాసాబ్ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది.

వచ్చే ఏడాది జనవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే రివీల్ చేశారు. ఇందులో ప్రభాస్ లుంగీ కట్టుకుని కనిపించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది కూడా భారీ VFX చిత్రం అవుతుందట. కాగా ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తే 2025 సంక్రాంతి కానుకగా భారీగా విడుదల చేయనున్నారు.

రాజా సాబ్ హారర్-కామెడీ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహన్, నిధి అగర్వాల్, బ్రహ్మానందం కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ మాస్ అవతార్‌ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు మారుతికి చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. దాంతో ఇప్పుడు ప్రభాస్‌ సినిమాతో భారీ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు.

Exit mobile version