Site icon HashtagU Telugu

Tollywood : టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. షూటింగ్స్ బంద్, వేతనాలపై వివాదం

Film Workers

Film Workers

Tollywood :  తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. సినిమా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ సమ్మె వెనుక ప్రధాన కారణం కార్మికుల వేతనాల పెంపు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న క్రాఫ్ట్స్ కార్మికులు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు పొందుతారు. ఈ ఒప్పందం గత నెల జూన్ 30తో ముగిసింది. దాంతో, తాజా నిబంధనలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Mouth Ulcers : నోట్లో పుండ్లు పుట్టి ఏం తినలేకపోతున్నారా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది

ఫెడరేషన్ నాయకులు స్పష్టంగా ప్రకటించారు: “వేతనాలను 30 శాతం పెంచితేనే రేపటి నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాం. లేదంటే ఈ సమ్మె కొనసాగుతుంది” అని హెచ్చరించారు.  ఇక ఈ డిమాండ్‌పై నిర్మాతలు, ఫిలిం ఛాంబర్, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన వాడివేడిగ చర్చల్లో ఫిలిం ఛాంబర్ వేతనాల పెంపును అంగీకరించలేదు. దీంతో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఈ పరిస్థితుల్లో నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. “వర్కర్స్ ఫెడరేషన్ కోరినట్లు స్వయంగా వేతనాలను పెంచుతూ లేఖలు జారీ చేయొద్దు. ఫెడరేషన్ మీడియాకు విడుదల చేసిన లేఖకు సంబంధించిన వివరాల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించండి. వర్కర్స్ ఫెడరేషన్ సూచించిన వేతన పెంపును మేము అంగీకరించలేదు” అని ఛాంబర్ స్పష్టం చేసింది. ఈ ప్రకటనను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ విడుదల చేశారు.

Prakasam District: వింత ఆచారం.. అక్కడ వధువు అబ్బాయి, వరుడు అమ్మాయి..ఎందుకో తెలుసా..?