Site icon HashtagU Telugu

Honey Rose: టాలీవుడ్ రోజ్ ‘హనీ రోజ్’

Honey Rose

Honey Rose

మల్లూ బ్యూటీ హనీ రోజ్ (Honey Rose) అందంతో ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) క్రేజ్ గా మారింది. వీరసింహారెడ్డి మూవీలో మెరిసిన హనీ రోజ్.. ఇక బాలయ్య టాక్ షో అన్ స్టాబబుల్ షోలోనూ కనిపించి మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. లేటెస్ట్ ప్రోమోలో హనీ రోజ్ ఎంట్రీ ఇచ్చింది. ‘‘బాలకృష్ణతో సినిమా అని చెప్పినప్పుడు అప్పుడు నువ్ ఏమైనా కనుక్కున్నావా, ఎలాంటి వాడోనని తెలుసుకున్నావా.. అని బాలకృష్ణ అంటే.. నేను మీ అఖండ సినిమా ఎన్నోసార్లు చూశాను. కానీ నేను ఎక్స్ పెక్ట్ చేసినదానికి ఏమాత్రం మీరు లేరు’’ అని హనీ రోజ్ (Honey Rose) తెలిపింది. వీరసింహారెడ్డి మూవీలోని ‘‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’’ పాటకు బాలయ్యతో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈ బ్యూటీ.

వీరసింహారెడ్డి మూవీ (Veerasimha Reddy)తో అటు టాలీవుడ్ ను, ఇటు సీని ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. మలయాళంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన హనీ వీర సింహారెడ్డి పాత్రతో మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలకృష్ణ (Balakrishna) కు తల్లి పాత్రలో, భార్య పాత్రలో కనిపించి రెండు విధాలుగా కూడా హనీ మెప్పించింది. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ లో వీర సింహారెడ్డి సినిమా తర్వాత హనీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హనీ రోజ్ తెలుగు (Tollwood)లో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుంది అనిపిస్తుంది.

Also Read: Veerasimha Reddy: జగన్ కు ‘వీరసింహారెడ్డి’ సెగ.. బాలయ్య డైలాగ్స్ వైరల్!