Site icon HashtagU Telugu

Tollywood Reacts: టాలీవుడ్ దెబ్బ‌కు దిగొచ్చిన మంత్రి.. స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కొండా సురేఖ‌!

Tollywood Reacts

Tollywood Reacts

Tollywood Reacts: నాగ‌చైత‌న్య‌- స‌మంత విడిపోవ‌డానికి కార‌ణం కేటీఆరే అని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల త‌ర్వాత స‌మంత‌కు, అక్కినేని కుటుంబానికి మ‌ద్ద‌తుగా టాలీవుడ్ ప్ర‌ముఖులు, పెద్ద‌లు అండ‌గా (Tollywood Reacts) నిల‌బ‌డ్డారు. దీంతో మంత్రి కొండా సురేఖ స‌మంత‌కు సారీ చెబుతూ ఓ ట్వీట్ వేశారు. అంతేకాకుండా త‌న మాట‌ల‌ని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు చెప్పారు.

సారీ చెబుతూ ట్వీట్

స‌మంత‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు స‌మంత‌. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అంటూ ట్వీట్ చేశారు.

Also Read: Chaitu – Sam Divorce : కొండా సురేఖ కామెంట్స్ పై అక్కినేని ఫ్యామిలీ సభ్యుల రియాక్షన్

మంత్రిపై జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫైర్‌

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం త‌న‌దైన శైలిలో స్పందిచారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగి దిగజారిపోయారు. మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని కాపాడుకోవాలి. సినిమా పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చూసి బాధగా ఉంది. ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం మౌనంగా కూర్చోమని ఎన్టీఆర్ ఘాటుగా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

నాని స్పంద‌న‌

చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.

అఖిల్ కూడా అస‌హ‌నం

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన ట్వీట్‌కు అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.

మంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కుష్బూ డిమాండ్‌

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.