సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఇప్పటికే గతంలో విడుదల అయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యాడ్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కు సినిమా కూడా అంతకుమించి ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
కాగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. మ్యాడ్ మూవీలాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్.
ఈ సారి హైదరాబాద్ లో చేసిన అరాచకాలు అయిపోయాయి. స్టోరీని గోవాకు మార్చాము. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు. ముందే క్లియర్ గా చెబుతున్నాను. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా ఈవెంట్ లో భాగంగా నాగ వంశీ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గతంలో విడుదల అయిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ సినిమాకు వస్తున్న స్పందనాన్ని బట్టి చూస్తే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని తెలుస్తోంది. టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.