Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఆమె కోసం చంద్రబాబుని సహాయం అడిగిన పవన్.. నిర్మాత కామెంట్స్..

Tollywood Producer Sharrath Marar Comments About Pawan Kalyan Chandrababu Naidu

Tollywood Producer Sharrath Marar Comments About Pawan Kalyan Chandrababu Naidu

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకోని వారికీ మద్దతు తెలిపారు అనే విమర్శ.. ఎప్పటినుంచో రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తూ వస్తున్న రూమర్. అయితే ఈ విషయంలో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. పోనీ విమర్శలు చేసేవారి దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే.. అవి కూడా లేవు. దీంతో అది ఒక రూమర్ గానే మిగిలిపోయింది. కానీ వైసీపీ నాయకులూ మాత్రం.. పవన్ ని ఇప్పటికీ ప్యాకేజీ స్టార్ అంటూనే విమర్శిస్తూ వస్తారు.

ఇక ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. “నేను పవన్ తో మూడు సినిమాలు చేశాను. అవి కూడా 2014 నుంచి 2017 సమయంలోనే. ఆయన వల్లే సీఎం అయిన చంద్రబాబు గారి నుంచి డబ్బులు కాదు కదా, ఒక చిన్న సహాయం కూడా పవన్ ఎప్పుడు ఆశించలేదు. కానీ ఒక్కసారి మాత్రం చంద్రబాబుని సహాయం అడిగారు. అది కూడా ఆయన కోసం కాదు. అస్సాంకి చెందిన ఓ ఐపీఎస్ ఆఫీస్ డ్యూటీలో చనిపోయాడు.

అతని భార్యకి ఏమైనా సహాయం చేయమని చంద్రబాబు గారిని కోరారు. అంతేతప్ప పవన్ ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు. నిజానికి ఈ డబ్బులు విషయంలో నేను, త్రివిక్రమ్.. పవన్ ని హెచ్చరించి తిట్లు తిన్నాము. ఎవరు సహాయం అని వచ్చినా.. అది నిజమో కాదో అని కూడా తెలుసుకోకుండా వారికీ డబ్బు సహాయం చేసేస్తాడు. అది చూసిన నేను, త్రివిక్రమ్.. పవన్ తో గొడవ పడేవాళ్ళం. నీకోసం కాకపోయినా, నీ పిల్లలు కోసమైనా డబ్బులు సేవింగ్స్ చెయ్యి అని మందలించేవాళ్ళం. కానీ పవన్ మాత్రం.. నేనేం చేయాలో నాకు తెలుసు, నాకేమి చెప్పక్కర్లేదు అంటూ మా మీద ఫైర్ అయ్యేవాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Pawan Kalyan : అందరి ముందు ఓపెన్‌గా.. పవన్‌కి మద్దతు ఇచ్చిన నిర్మాత..