Pawan Kalyan : అందరి ముందు ఓపెన్‌గా.. పవన్‌కి మద్దతు ఇచ్చిన నిర్మాత..

అందరి ముందు ఓపెన్‌గా పవన్‌కి మద్దతు తెలిపిన నిర్మాత. గత ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న టాలీవుడ్ ఈ ఎన్నికల్లో మాత్రం..

Published By: HashtagU Telugu Desk
Tollywood Producer Naga Vamsi Supports Pawan Kalyan Janasena

Tollywood Producer Naga Vamsi Supports Pawan Kalyan Janasena

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి.. ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతూ వస్తున్నారు. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిన పవన్‌కి.. గత ఎన్నికల్లో టాలీవుడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ అందలేదు. కానీ ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి భారీ మద్దతు వెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కి ఓపెన్ గా మద్దతు తెలుపుతూ జనసేనకు మద్దతుదారులకు కొండంత ధైర్యం అవుతున్నారు.

ఇక చిరంజీవే భారంగంగా సపోర్ట్ తెలుపుతుండడంతో.. ఇన్నాళ్లు మౌనం మెయిన్‌టైన్ చేస్తూ వచ్చిన కొందరు సినీ ప్రముఖులు పవన్ కి ఓపెన్ గా సపోర్ట్ తెలియజేస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, డాన్స్ మాస్టర్ జానీ, టీవీ నటీనటులు, అలాగే బడా నిర్మాతలు అయిన మైత్రి, డివివి, ఏ ఎం రత్నం, బివిఎస్‌ఎన్ ప్రసాద్.. వీరంతా ఇప్పటికే ఫీల్డ్ లో దిగి పవన్ కి మద్దతు తెలియజేసారు. ఇక తాజాగా మరో నిర్మాత కూడా ఓపెన్ గా తమ మద్దతుని వెల్లడించారు.

పవన్ అండ్ త్రివిక్రమ్ కి మంచి స్నేహితులైన నిర్మాతలు చిన్నబాబు, నాగవంశీ.. ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో తమ స్టాండ్ ఏంటి అనేది తెలియజేయలేదు. తాజాగా ఈ విషయం పై నాగవంశీ ఓ క్లారిటీ ఇచ్చేసారు. పవన్ కి మీరు అత్యంత సన్నిహితులు, మరి మీ సపోర్ట్ ఎటువైపు అని ప్రశ్నించగా, నాగవంశీ బదులిస్తూ.. “పవన్ కి సన్నిహితులం అని మీరే అంటున్నారు. అంటే మా సపోర్ట్ కచ్చితంగా కళ్యాణ్ గారికే ఉంటుందని మీకు తెలిసి ఉండాలిగా” అంటూ చెప్పుకొచ్చారు.

మరి పవన్ ని సపోర్ట్ చేస్తూ ఏమైనా ప్రచారం చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా, నాగవంశీ బదులిస్తూ.. “ప్రచారం వంటివి చేయడం లేదు గాని. మేము కోరేది ఒకటే. ఇక్కడ ఉన్న ఆంధ్రా ప్రజలంతా ఎన్నికలకు వెళ్లి పవన్ కి ఓటు వెయ్యాలని కోరుతున్నాము. అదే కళ్యాణ్ గారికి మనం చేసే సేవ” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Gangs of Godavari : సినిమానే రిలీజ్ కాలేదు.. అప్పుడే సీక్వెల్.. పుష్పలా ప్లాన్..!

  Last Updated: 28 Apr 2024, 12:08 PM IST