Site icon HashtagU Telugu

Chiranjeevi Hospital: మానవత్వంలోనూ ‘మెగాస్టార్’.. చిత్రపురిలో హాస్పిటల్ నిర్మాణం!

Hospital

Hospital

చిరంజీవి కొణిదెల… సినిమాల్లో మాత్రమే మెగాస్టార్ కాదు.. మానవత్వంలోనూ మెగాస్టార్ అని అనిపించుకుంటున్నారు. ఇటీవల ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారు. ఆపదలో ఉన్న నటులను, అభిమానులను కలుస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు. కరోనా సమయంలోనూ మెగాస్టార్ తన చేతనైన సాయం చేశారు. తాజాగా మరోసారి ఓ సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు చిరంజీవి. చిరు గతంలో చాలా సందర్భాలలో తెలుగు చిత్ర పరిశ్రమలో నిరుపేద కళాకారులు, కార్మికులకు తన సహాయాన్ని అందించారు. ఇప్పుడు, అతను ఒక పెద్ద లక్ష్యం కోసం ముందుకు వచ్చాడు.

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో బిపిఎల్ కార్మికులు, టాలీవుడ్ కార్మికుల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. చిరు చెప్పిన విధంగా 10 పడకలతో కూడిన ఈ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక సంవత్సరంలో ఆసుపత్రిని పూర్తి చేసి, వచ్చే పుట్టినరోజున దానిని ప్రారంభిస్తానని ప్రమాణం చేశాడు. హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ తమ అవసరాలు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం అన్ని సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తామని చిరు తెలిపారు. దీనికి తన తండ్రి పేరు పెడతానని మీడియా ఇంటరాక్షన్‌లో చిరు తెలిపారు.

Exit mobile version