Surekhavani : టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా యుగం వచ్చిన దగ్గర నుంచి.. సినిమాల్లో కనిపించడం కంటే ఎక్కువగా నెట్టింటలో సందడి ఎక్కువైంది. బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. తన కూతురితో కలిసి రీల్స్, డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఈమె ఏం షేర్ చేసిన అది వైరల్ కావాల్సిందే.
తాజాగా ఈ నటి తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ చేసారు. ఆ పోస్టులో సురేఖవాణి బాలీవుడ్ పార్టీలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ సోషల్ మీడియా స్టార్ ‘ఒర్రి’ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. బి-టౌన్ లో జరిగే పార్టీల్లో హాజరవ్వుతూ.. సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగుతూ సందడి చేస్తుంటాడు. తాజాగా ఓ పార్టీలో ఇలానే కొన్ని ఫోటోలను దిగి షేర్ చేసాడు. ఆ పిక్స్ లో సురేఖవాణి కూడా ఉన్నారు.
హాఫ్ హెయిర్ కట్, మోడరన్ డ్రెస్సులో హాట్ షో చేస్తూ సందడి చేస్తున్నారు. టాలీవుడ్ లో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖవాణి.. బాలీవుడ్ పార్టీలో కనిపించడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కాగా సురేఖవాణి తన వారసురాలు ‘సుప్రీత’ని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో సుప్రీత హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు.