Nag@100: భారీ బడ్జెట్ తో నాగార్జున వందో సినిమా.. ఏకంగా నలుగురు డైరెక్టర్లతో!

క్రికెట్ లో సెంచరీ కొడితే ఆటగాళ్లకే కాదు.. క్రికెటర్ కు ఓ రికార్డు లాంటింది. అదే సినిమాలో సెంచరీ కొడితే.. అంతకంటే గొప్పది.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 04:34 PM IST

క్రికెట్ లో సెంచరీ కొడితే ఆటగాళ్లకే కాదు.. క్రికెటర్ కు ఓ రికార్డు లాంటింది. అదే సినిమాలో సెంచరీ కొడితే.. అంతకంటే గొప్పది. సినిమా హీరోలకు వందో చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పటికే టాలీవుడ్ ఆ మైలురాయిని చిరంజీవి, బాలయ్య అందుకొని దూసుకుపోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున వంతు వచ్చింది. తన వంద సినిమా టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిలిచేందుకు నాగ్ ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తున్నారు.

నాగార్జున అక్కినేని తన 100వ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. మైల్‌స్టోన్‌ సినిమాగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారీ కథతో రావాలని నలుగురు దర్శకులకు బాధ్యతలు అప్పగించాడు. “ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ విషయంలో నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్లలో ఎవరికైనా సరైన ఆలోచన రాగానే సినిమాను ప్రకటిస్తాను’’ అని నాగార్జున మీడియాకు తెలిపారు.

హిందీ చిత్రం బ్రహ్మాస్త్ర విజయంతో ఆకట్టుకున్న నాగార్జున ‘‘బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మస్త్రను ఎంజాయ్ చేస్తున్నారని,  రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది’’ అని నాగార్జున అన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు. “మారిన కాలానుగుణంగా కథలు, స్క్రిప్ట్‌లను ఎంచుకోవాలి” అని  చెప్పారు. “సీతా రామం”, “ఒకే ఒక జీవితం” లాంటి చిత్రాల విజయం నాగార్జునను మంచి కంటెంట్‌ని నిర్మించడానికి ప్రేరేపించాయి.