Tollywood Hero’s : మన టాలీవుడ్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?

మన సెలబ్రిటీల గురించి మనకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అయితే ప్రేక్షకులని తమ నటనతో మెప్పించిన హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?

  • Written By:
  • Publish Date - May 20, 2023 / 07:00 AM IST

మన టాలీవుడ్(Tollywood) ని ఏలుతున్నారు హీరోలు. హీరోని చూసే సినిమాలకు ప్రేక్షకులు, అభిమానులు వస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్(NTR) నుంచి ఇప్పుడు వచ్చే కొత్త హీరోల వరకు అంతా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మన సెలబ్రిటీల గురించి మనకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అయితే ప్రేక్షకులని తమ నటనతో మెప్పించిన హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?

కొంతమంది హీరోలు ఫారెన్ వెళ్లి మరీ చదువుకున్నారు. కొంతమంది ఇక్కడే చదువుకున్నారు. కొంతమంది అయితే చదువు మధ్యలోనే ఆపేసి నటన వైపు ప్రయాణం మొదలుపెట్టారు. చదువుకు, ట్యాలెంట్ కి సంబంధం లేదని పలువురు హీరోలు నిరూపించారు.

 

మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నర్సాపూర్ లో కామర్స్ లో డిగ్రీ చేశారు. బాలకృష్ణ(Balakrishna) కూడా నిజం కాలేజీలో డిగ్రీ చదివారు. నాగార్జున(Nagarjuna) అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివారు. వెంకటేష్(Venkatesh) కూడా అమెరికాలో MBA చదివి వచ్చారు.

ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ తోనే ఆపేశాడు. ఇంటర్ అయ్యేసరికి స్టార్ హీరో అయిపోవడంతో చదువు ఆపేశాడు. చదువు తక్కువ చదివినా నటనలో ఎన్టీఆర్ అంటే ఏంటో అందరికి తెలిసిందే. ఇక పలు భాషలు కూడా మాట్లాడతాడు. డ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇన్ని ట్యాలెంట్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులని మెప్పిస్తునే ఉన్నాడు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఇంటర్ తో ఆపేశాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో చదువు ఆపేసి కరాటే లాంటి పలు కోర్సులు నేర్చుకున్నాడు. సినిమాల్లో వివిధ శాఖల్లో పనిచేశాడు. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. పవన్ కూడా ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడగలడు.

మహేష్ బాబు చెన్నైలో కామర్స్ లో డిగ్రీ చేశాడు. ఓ పక్క చదువుకుంటూనే పలు సినిమాల్లో నటించాడు మహేష్.

ప్రభాస్ హైదరాబాద్ లో B tech పూర్తిచేశాడు. మంచు మనోజ్ తిరుపతిలో B tech పూర్తి చేశాడు. అల్లు అర్జున్ హైదరాబాద్ లో BBA డిగ్రీ చేశాడు. రామ్ చరణ్ హైదరాబాద్ లో డిగ్రీ చేశాడు. నితిన్ హైదరాబాద్ లో B tech పూర్తి చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ విజయవాడలో డిగ్రీ పూర్తి చేశాడు. రానా యాక్టింగ్ లో డిగ్రీ చేశాడు. గోపీచంద్ రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అఖిల్ అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. నాగచైతన్య కామర్స్ లో డిగ్రీ చేశాడు. కళ్యాణ్ రామ్ అమెరికాలో MS చేశాడు. నాని హైదరాబాద్ లో డిగ్రీ చేశాడు. రాజశేఖర్ MBBS చదివి కొన్ని రోజులు డాక్టర్ ప్రాక్టీస్ కూడా చేశారు. శర్వానంద్ హైదరాబాద్ లో డిగ్రీ చేశాడు. రామ్ కూడా డిగ్రీ చేశాడు. విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోనే B com చేశాడు. ఇలా హీరోలు ఏం చదివినా, చదువు మధ్యలో ఆపేసినా తమ నటనతో మాత్రం ప్రేక్షకులని మెప్పిస్తున్నారు.

 

Also Read :  Aishwarya Rai : రెండు దశాబ్దాలుగా.. ప్రతి సంవత్సరం కాన్స్ లో ఐశ్వర్య రాయ్ హాజరు.. మొదటిసారి ఎప్పుడో తెలుసా??