Site icon HashtagU Telugu

Samantha Shocking? సమంత సంచలన నిర్ణయం.. అలాంటి సీన్స్ కు ‘నో’

Samantha

Samantha

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘యశోద’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ తో పాటు ఆమె హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత గ్లామర్ డోస్ పెంచిన సామ్ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

తన భవిష్యత్ చిత్రాలలో ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్‌లకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకుందట. తన షరతులకు అంగీకరిస్తేనే ఆమె సినిమాలకు సైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్త కరెక్ట్ లేదా ఫేక్ అనేది తెలియాల్సి ఉంది. వివాహానంతరం, కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సంతకం చేసిన సమంత, వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఆ సన్నివేశాల కారణంగా నాగ చైతన్య, సమంతల మధ్య విభేదాలు తలెత్తాయని, చివరికి అది విడాకులకు దారితీసిందని సమాచారం.

Exit mobile version