Site icon HashtagU Telugu

Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిక్ నేమ్ అదే.. ఇప్పటికీ అలాగే పిలుస్తారంటూ!

Mixcollage 11 Feb 2024 01 20 Pm 7827

Mixcollage 11 Feb 2024 01 20 Pm 7827

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె గత ఏడాది మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ బిజీగా మారే ప్రయత్నంలో ఉంది లావణ్య త్రిపాఠి. అందులో భాగంగానే ఈమె త్వరలోనే మిస్ పర్ఫెక్ట్ అనే సినిమా వెబ్ సిరీస్ లో నటిచింది. ఈ వెబ్ సిరీస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న లావణ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన నిక్ నేమ్ తెలిపింది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ చున్ చున్ తనని పిలిచేవారు తెలిపింది లావణ్య త్రిపాఠి. అయితే వినడానికి చిన్ చాన్ కార్టూన్ పేరులా ఉన్న ఈ పదం ఒక రైమ్ లోనిదట. చిన్నప్పుడు లావణ్య ఆ రైమ్ ని పడేవారట. ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబెర్స్ లావణ్యకి ఆ పేరుని పెట్టారట. ఇక ఈ పేరు అంటే లావణ్యకి కూడా చాలా ఇష్టమట.

ఇప్పటికీ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తనని అలాగే పిలుస్తూ ఉంటారట. అనంతరం ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ.. వరుణ్ తో ప్రేమ ప్రయాణంలో ఎలాంటి ప్రపోజల్స్ చేసుకోలేదు. ఎందుకంటే, ఇద్దరి నుంచి ఇష్టముందని తెలిసి లవ్ జర్నీలో ముందుకు వెళ్ళాం. అయితే పెళ్ళి విషయంలో మాత్రం వరుణే ముందుగా ప్రపోజ్ చేశారు. కానీ నేను పెళ్లి వరకు అంత దూరం ఆలోచించలేదు.నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఒక చిన్న ఆలోచన మనసులో ఉండడంతో ఓకే చెప్పేశాను. అలా ఇద్దరం ఒక్కటి అయ్యము అని తెలిపింది లావణ్య త్రిపాఠి.

Exit mobile version