Site icon HashtagU Telugu

Anjali Latest Look: అందాలతో సెగలు పుట్టిస్తున్న అంజలి.. నెట్టింట ఫోటోస్ వైరల్?

Mixcollage 27 Feb 2024 08 38 Am 4206

Mixcollage 27 Feb 2024 08 38 Am 4206

తెలుగు ప్రేక్షకులకు నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి అన్ని భాషల్లోనూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకుంది నటి అంజలి. ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా అంజలి తెలుగులో పలు సినిమాలలో నటించగా అందులో జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు ఈమెకు భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

అయితే అంజలి పక్కా తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళంలో బాగా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా కోలీవుడ్ లోనే బాగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికీ అక్కడే అలరిస్తోంది. తెలుగు సినిమాల్లో ఆ మధ్యలో సెకండ్ హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది. అలాగే స్పెషల్ సాంగ్స్ ల్లోనూ నటిస్తూ వచ్చింది. కానీ హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మళ్లీ నటి అంజలికి టాలీవుడ్ లో మంచి రోజులు కనిపిస్తున్నాయి. తన కెరీర్ లో హిట్ సినిమా గీతాంజలి కి సీక్వెల్ ను అనౌన్స్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఇలా టాలీవుడ్ లో మళ్లీ రైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే అంజలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అందుకోసమే ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. తాజాగా అంజలి పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింక్ బ్లేజర్ చాల అందంగా కనిపిస్తోంది. తన బ్లేజర్ తీసేసి టాప్ అందాలతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ లో కూడా ఎంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంజలికి వయసుతోపాటు అందం కూడా పెరుగుతోంది.

Exit mobile version