Pawan Kalyan : పవన్ కోసం కదిలొస్తున్న టాలీవుడ్.. మెల్లిగా అందరూ బయటకి వచ్చేస్తున్నారుగా..

పవన్ కోసం కదిలొస్తున్న టాలీవుడ్. మెల్లిమెల్లిగా అందరూ పవన్ కి మద్దతు తెలుపుతూ వచ్చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tollywood Heroes Support For Pawan Kalyan Janasena Elections 2024

Tollywood Heroes Support For Pawan Kalyan Janasena Elections 2024

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకి ఉన్న భారీ స్టార్‌డమ్ ని పక్కన పెట్టేసి, జన కోసం జనసేన స్థాపించి రాజకీయాలు వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. 2014లో పార్టీని స్థాపించి పవన్ పాలిటిక్స్ లో తన ఒంటరి ప్రయాణం స్టార్ట్ చేసారు. ఇన్నాళ్ల ప్రయాణంలో పవన్ కి సినిమా పరిశ్రమ నుంచి ఎటువంటి సపోర్ట్ అందలేదు. మెగా హీరోలు సైతం తమ మద్దతు తెలపకుండా సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం టాలీవుడ్ అంతా కదిలివస్తుంది. మెల్లిమెల్లిగా అందరూ పవన్ కి మద్దతు తెలుపుతూ వచ్చేస్తున్నారు.

మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ పవన్ కోసం ఫీల్డ్ లోకి దిగి ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. అలాగే జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, డాన్స్ మాస్టర్ జానీ, టీవీ నటుడు సాగర్, 30 ఇయర్స్ పృద్వితో పాటు మరికొంతమంది నటీనటులు పవన్ కోసం బయటకి వచ్చి పలు జిల్లాల్లో ప్రచారం చేస్తూ పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. కాగా నిన్నటి వరకు ఒక లెక్కలో ఉంటే, నిన్న చిరంజీవి వీడియో మెసేజ్ తో జనసేన మద్దతుదారుల లెక్క మరో స్థాయిలోకి చేరింది.

ఇన్నాళ్లు మౌనం పాటించిన చిరంజీవి ఈ ఎన్నికల్లో మాత్రం కొంచెం కొంచెంగా గొంతు వినిపిస్తూ వస్తున్నారు. ఇక నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. చిరంజీవి ఇలా వీడియో రిలీజ్ చేసారో లేదో.. ఒక్కొక్కరిగా టాలీవుడ్ లోని ఇతర హీరోలు పవన్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్స్ వేస్తూ వచ్చారు. వీరిలో మొదటి వ్యక్తి నేచురల్ స్టార్ నాని. పవన్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నాని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. తాజాగా నిన్న కూడా పవన్ గెలవాలంటూ ట్వీట్ వేశారు.

ఆ తరువాత తేజ సజ్జ, సంపూర్ణేష్ బాబు, రాజ్ తరుణ్, నిర్మాత నాగవంశీ, రామ్ చరణ్.. ఇలా ఒకరి తరువాత ఒకరు ట్వీట్ చేసి పవన్ కి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఒక్కసారిగా టాలీవుడ్ అంతా పవన్ కి సపోర్ట్ గా నిలవడంతో.. ఎన్నికల వేడి మరింత పెరిగింది. మరి టాలీవుడ్ సపోర్ట్ పవన్ కి ఎంతవరకు బలం అవుతుందో చూడాలి.

  Last Updated: 08 May 2024, 07:44 AM IST