Site icon HashtagU Telugu

Tollywood : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

Tollywood Hero Who Is Going

Tollywood Hero Who Is Going

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్‌ ను ఆగస్టు 22, 2024 న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంతోనే సూపర్ హిట్ కొట్టాడు. మధ్యలో వరుసగా కొన్ని ప్లాఫ్‌ లు ఎదురైనా ఈ మధ్యనే ‘క’ తో సూపర్ హిట్ అందుకొని తన సత్తా చాటాడు.