Site icon HashtagU Telugu

Rana Visit Tirumala: శ్రీవారి సేవలో దగ్గుబాటి రానా ఫ్యామిలీ

Rana

Rana

తిరుమల శ్రీవారిని దగ్గుబాటి రానా కుటుంబం దర్శించుకుంది. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత సురేశ్‌ బాబు, రానా కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటిడి ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. వేంకటేశ్వరుడిని దర్శించుకొని బయటకు వస్తున్న సమయంలో రానాను అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.