Raj Tarun : జీవితంలో పెళ్లి చేసుకోను అంటున్న రాజ్ తరుణ్.. వాళ్ళ అమ్మానాన్నలు..

జీవితంలో పెళ్లి చేసుకోను అంటున్న రాజ్ తరుణ్. ఈ నిర్ణయానికి వాళ్ళ అమ్మానాన్నలు..

Published By: HashtagU Telugu Desk
Tollywood Hero Raj Tarun Said He Didnt Marry In Life Comments Viral

Tollywood Hero Raj Tarun Said He Didnt Marry In Life Comments Viral

Raj Tarun : షార్ట్ ఫిలిమ్స్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీ వరకు చేరుకున్న హీరో ‘రాజ్ తరుణ్’. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్.. సినిమా చూపిస్తా మావా, కుమారి 21F.. వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. కానీ ఆ క్రేజ్ ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయారు. సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోక ప్లాప్స్ ని అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న సరైన హిట్ పడడం లేదు.

ఇది ఇలా ఉంటే, రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ హీరో తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. మూడు పదుల వయసు దాటినా ఈ హీరో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా, రాజ్ తరుణ్ బదులిస్తూ.. “నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను. పెళ్లి, పిల్లలు అంటే నాకు ఇష్టం లేదు. సింగిల్ గా హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనీ ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ నిర్ణయానికి ఇంటిలో అమ్మానాన్నలు ఒప్పుకున్నారా..? అని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు రాజ్ తరుణ్ బదులిస్తూ.. “ఏ విషయంలో అయినా మా నాన్న నా ఇష్టానికే వదిలేస్తారు. ఇక అమ్మ మొదటిలో పెళ్లి గురించి అడిగేది. కానీ ఇప్పుడు ఆమె కూడా నా ఇష్టమని వదిలేసింది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో పెళ్లికాని హీరోలు చాలా మందే ఉన్నారు. వారిని పెళ్లి గురించి అడిగితే.. టైం ఉంది, చేసుకుందాంలే అని చెప్పుకొస్తారు. కానీ రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోను అంటూ బోల్డ్ నిర్ణయాన్ని చెప్పడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. మరి భవిషత్తులో ఈ నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటారా లేదా చూడాలి.

Also read : Rajamouli-Mahesh: రాజమౌళి, మహేశ్ మూవీ నుంచి మరో కీలక అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే

  Last Updated: 22 Apr 2024, 11:15 AM IST