Nithiin : టాలీవుడ్ హీరో నితిన్ 2020లో షాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ రెండేళ్లు ఒక భర్తగా తన భాద్యతలను నిర్వర్తించిన నితిన్.. ఇప్పుడు తండ్రి భాద్యతలను తీసుకునేందుకు సిద్దమవుతున్నారట. అవును నితిన్ తండ్రి కాబోతున్నారట. ప్రస్తుతం ఆయన సతీమణి షాలిని గర్భంతో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ నెలలోనే ఆమెకు డెలివరీ కానుందని చెబుతున్నారు.
మరికొన్ని రోజుల్లో నితిన్ ఇంటిలోకి బుడి బుడి అడుగులు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మరి నితిన్ ఇంటికి మహాలక్ష్మి వస్తుందా లేదా జూనియర్ నితిన్ వస్తాడా..? అనేది చూడాలి. కాగా ఈ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. టాలీవుడ్ ఆడియన్స్ నితిన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. 2020 నుంచి ఒక్క హిట్ కూడా లేదు. ఈ రెండేళ్లలో ఐదు సినిమాలు చేయగా, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి మూవీ నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని హిట్ దర్శకులతో వస్తున్నారు. తనకి చివరిగా ‘భీష్మ’తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేసిన వేణు శ్రీరామ్ తో ‘తమ్ముడు’ అనే మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏకధాటిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
రాబిన్ హుడ్ సినిమా కామెడీ హీస్ట్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక తమ్ముడు చిత్రం విషయానికి వస్తే.. సిస్టర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. హీరోకి అక్కగా ఒకప్పటి హీరోయిన్ ‘లయ’ నటిస్తున్నారు. నితిన్ కి జోడిగా కాంతార భామ ‘సప్తమి గౌడ’ నటిస్తున్నట్లు సమాచారం.