Site icon HashtagU Telugu

Nani Injured: షూటింగ్ లో నానికి గాయాలు.. తప్పిన ప్రమాదం

Dasara

Dasara

నేచురల్ స్టార్ నాని ఇటీవల తన అప్ కమింగ్ మూవీ దసరా షూటింగ్ లో పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. రామగుండం సింగరేణి కాలరీస్‌లో జరుగుతున్న దసరా సినిమా షూటింగ్‌లో నటుడు నాని గాయపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షూటింగ్ జరుగుతున్న సమయంలో లోడుతో కూడిన టిప్పర్ నుంచి బొగ్గు నానిపై పడిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన టీం సభ్యులు అతడిని రక్షించి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం నాని షూటింగ్‌కు తిరిగి రావడంతో ఆయన అభిమానుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం ఇటీవల ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది.