Rakesh Master : బ్రేకింగ్.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత..

నిన్నటి నుంచి వైద్యులు రాకేష్ మాస్టర్ కి చికిత్స అందిస్తున్నారు. ఆయన షుగర్ పేషేంట్ కావడం, పలు ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో చికిత్స అందుకుంటూ నేడు సాయంత్రం మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Tollywood Famous dance master Rakesh Master passes away with health issues

Tollywood Famous dance master Rakesh Master passes away with health issues

ఇటీవల సినీ పరిశ్రమలో వరుసవిషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్(Tollywood) లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్(Rakesh Master) హఠాత్తుగా కన్నుమూశారు.

ఇటీవలే వైజాగ్ లో షూట్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన రాకేష్ మాస్టర్ ఆదివారం ఉదయం విరోచనాలు, వడదెబ్బతో ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి వైద్యులు రాకేష్ మాస్టర్ కి చికిత్స అందిస్తున్నారు. ఆయన షుగర్ పేషేంట్ కావడం, పలు ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో చికిత్స అందుకుంటూ నేడు సాయంత్రం మరణించారు.

రాకేష్ మాస్టర్ నేడు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. మరో మాస్టర్ బషీర్, రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మీడియాకు తెలియచేశారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు రాకేష్ మాస్టర్. ఎన్నో మంచి మంచి సాంగ్స్ లో తన స్టెప్స్ తో అదరగొట్టారు. ఆ తర్వాత ఢీ, ఆట లాంటి పలు డ్యాన్స్ షోలలోనూ జడ్జిగా, టీం లీడర్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత మనీ ప్రాబ్లమ్స్ తో కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. అప్పట్నుంచి నుంచి డ్యాన్స్ కి కొంచెం దూరమయి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. శేఖర్ మాస్టర్ తో సహా పలువురు కొరియోగ్రాఫర్స్ రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన వారే. రాకేష్ మాస్టర్ మృతితో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

 

Also Read : Adipurush : వెనక్కు తగ్గిన ఆదిపురుష్ చిత్రయూనిట్.. డైలాగ్స్ మారుస్తాం అంటూ ప్రకటన..

  Last Updated: 18 Jun 2023, 08:03 PM IST