Site icon HashtagU Telugu

Surya : సూర్య కోసం వెయిటింగ్ లిస్ట్ లో తెలుగు దర్శకులు..!

Surya Karthik Subbaraju Combination movie Santosh Narayanan Music Composer

Surya Karthik Subbaraju Combination movie Santosh Narayanan Music Composer

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)తో సినిమా కోసం తెలుగు దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. గజినితో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సూర్య అప్పటి నుంచి తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తూ ఫాం కొనసాగిస్తున్నాడు. సూర్య ప్రస్తుతం చేస్తున్న కంగౌవ సినిమాపై కూడా తెలుగులో భారీ హైప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే సూర్యతో సినిమా కోసం మన మేకర్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు.

We’re now on WhatsApp : Click to Join

దశాబ్ధకాలంగా సూర్యతో త్రివిక్రం సినిమా అని చర్చ జరిగినా అది ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. కారణాలు ఏంటో తెలియదు కానీ త్రివిక్రం సూర్య సినిమా చర్చల దశల్లోనే ఆగిపోయింది. బోయపాటితో కూడా సూర్య సినిమా చేయాలని అనుకున్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు.

కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటితో సూర్య సినిమా దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే. ప్రస్తుతం చందు మొండేటి నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. సూర్యతో తెలుగులో తీసే డైరెక్టర్ చందునే అని తెలుస్తుంది.

Also Read : Trisha : 13 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న త్రిష..!